Thursday, 24 April 2014

Thrikala Sandhya Vandanam in Telugu

శ్రీరామ 

Thrikala Sandhya Vandanam

త్రికాల సంధ్యావందనం 

ఓం మహా గణపతయే నమః 

తొలి పలుకు (Preface) :-

ఓం శ్రీ గురుభ్యో నమః  
మాత్రుభ్యో నమః 
పిత్రుభ్యో నమః 

ఎందరో మహానుభావులు చే పూజా విధానము ఇంటర్నెట్ లో పెట్టబడినిది, నేను కూడా ఒక్క చిన్న ప్రయత్నం చేయుచున్నాను.  తప్పులు ఉంటే నన్ను మన్నించి సరిదిద్దమని ప్రార్ధన. 


ధర్మో రక్షతి రక్షితః రామాయణం లో చెప్పబడిన ఒక సన్నివేశం తో మొదలుపెడతాను.
శ్రీరాముడు వనవాసం లో ఉండగా, బాగా చలి కాలమున ఒక రోజు తెల్లవారుజామున లేచి  స్నానం చేసి ప్రాతః సంధ్య చేసుకొనుటకు ఒక సరస్సు కి వెళ్ళారు. అదే సమయమున ఒక ఏనుగు నీరు తాగుటకు అక్కడే వున్నది. తొండం తో నీరు తీసుకొంటున్నది కానీ తాగలేక విడిచిపెడుతున్నది, ఆ చల్లటి నీరు తాగితే ఎక్కడ ప్రాణం పోతుందో అనే భయం తో. అప్పుడు శ్రీరాములవారు సరస్సులో స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నారు 
అందుకే "రామో విగ్రహవాన్ ధర్మః " అంటారు. ఇది శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి అమృత ప్రవచనముల నుంచి తీసుకున్నది.

సంధ్యావందనం మీద శ్రింగేరి జగద్గురువుల వారి అనుగ్రహ భాషణం 
https://www.youtube.com/watch?v=qnZaovlUjbU

ఉపనయనం అయిన తరువాత సంధ్యావందనం చేయవలసిందే, అందులో ఎలాంటి సంధిగ్ధము లేదు. గురవు (గురువు అంటే సంధ్యావందనం చేసే వారు ఎవరయినా కావచ్చు) దగ్గర నేర్చుకొనుట ఉత్తమము. గురవు దొరకలేదనే కారణంతో అసలే మానేయకుండా ఉండుటకు ఈ ప్రయత్నము.  

సంధ్యావందనం లేదా దేవుడి పూజ అనగానే ఇప్పుడు వచ్చే విపరీత ఆలోచనలు. 
1. చేస్తే ఏంటి లాభం 
     లాభ నష్టాలు చూసుకోవడానికి ఇదేమి వ్యాపారము కాదు కదా!! మామిడి మొక్క నాటగానే పండు కావాలంటే వస్తుందా, మొక్కకి నీరు పోసి పెంచితే అది వృక్షమై కమ్మని పండ్లు ఇచినట్లు, సంధ్యావందనం తో చేసే గాయత్రీ జపం గొప్ప సత్ఫలితాలు ఇస్తుందని పెద్దల మాట. అది ఈరోజో లేదా రేపో తెలిసేది కాదు దీర్ఘ కాలం లో(long run) తెలుస్తుంది. 

2. వ్యవధి(టైం) లేదు లేదా వసతి లేదు 
     సంధ్యావందనం ఎలా చెయ్యాలి అని ఆలోచించాలి కాని చెయ్యకుండా ఉండుటకు సాకులు వెతకొద్దు. ఎలా అయినా సరే చెయ్యాలి అనే మనసుంటే మార్గం ఆ ఈశ్వరుడు కల్పిస్తాడు. ట్రైన్ లో ప్రయాణిస్తూ కూడా స్నానం చేసి  సంధ్యావందనం చేసిన వాళ్ళు ఉన్నారు(మా నాన్న గారు)


3. కాలం లో కూడా ఇంకా ఇలాంటివా
     సంధ్యావందనం చేయడం మన ధర్మం, స్వధర్మం ఆచరించడానికి వేరొకరి సలహాలు వినడం మానండి.
   కాలం మారిందని గాలి పీల్చడం మానేస్తారానీరు బదులు పాదరసం(mercury) తాగుతారా? కాలం అయినా  సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు!! అలాగే కాలం తో మారనివి కొన్ని ఉంటాయి, అందులో సంధ్యావందనం ఒకటి!!!

పూజా విధానం :-

రెండు పంచపాత్రలు(glass) లో నీళ్లు , ఒక హరివేణం(plate), ఒక ఉద్దరిన(spoon)
ఆచమనం కి ఒక పంచపాత్ర, ఈ పంచపాత్ర లో నీళ్ళు ఆచమనం కి మాత్రమే వాడవలెను 

ప్రాతః/మధ్యాహ్నిక సంధ్య  తూర్పు వైపు కూర్చొని చేయవలెను 
సాయం సంధ్య  ఉత్తరం వైపు కూర్చొని చేయవలెను 

శుక్లాం భరధరమ్ విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయేత్. 


ఉద్ధరిన లొ నీరు తీసుకొని ఉంగరం వేలితో శిరస్సు మీద చల్లుకుంటూ క్రింది మంత్రము చెప్పవలెను, మూడు సార్లు చల్లుకోనవలెను

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతో‌உపివా । 
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః ||
పుండరీకాక్ష ! పుండరీకాక్ష ! పుండరీకాక్షాయ నమః |

** స్వాహా అన్నపుడు  -- చేతిని గోకర్ణ ఆకారముగ పట్టి జలము తీసుకొని ఆచమించవలెను. 

గోకర్ణ ఆకారముగ అనగా కుడి చేతి బొటన వేలుని చూపుడు వేలుకి మధ్య వేలుకి మధ్యలో ఉంచి చూపుడు వేలుని మూయవలెను. 

ఆచమ్య :-


ఓం కేశవాయ స్వాహా 
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా 
ఓం గోవిందాయ నమః  -- అని చేతులు కడిగికొని 
ఓం విష్ణవే నమః  -- అని చేతులు కడిగికొని 
ఓం మధుసూదనాయ నమః  -- బొటన వేలుతో పై పెదవిని తుడుచుకొనుము 
ఓం త్రివిక్రమాయ నమః -- బొటన వేలుతో కింద పెదవిని తుడుచుకొనుము 
ఓం వామనాయ నమః  -- ఉంగరం వేలుతో జలము శిరమున  చల్లుకోనుము 
ఓం శ్రీధరాయ నమః  -- ఉంగరం వేలుతో జలము శిరమున చల్లుకోనుము 

ఓం హృషీకేశాయ నమః  -- ఎడమ చేతిపై జలము చల్లుకోనుము 
ఓం పద్మనాభాయ నమః  -- పాదముల పై జలము చల్లుకోనుము  

ఓం దామోదరాయ నమః  -- జలము శిరమున చల్లుకోనుము 
ఓం సంకర్షణాయ నమః  -- అని అన్ని వేళ్ళ మూలాలతో గడ్డమును తాకుము
ఓం వాసుదేవాయ నమః  -- అని బొటన వేలుతో కుడి ముక్కు రంధ్రమును తాకుము 
ఓం ప్రద్యుమ్నాయ నమః  -- అని చూపుడు వేలుతో ఎడమ ముక్కు రంధ్రమును తాకుము 
ఓం అనిరుద్ధాయ నమః -- అని బొటన వేలుతో కుడి కన్నును తాకుము
ఓం పురుషోత్తమాయ నమః  -- అని ఉంగరం వేలుతో ఎడమ కన్నును తాకుము
ఓం అధోక్షజాయ నమః  -- అని బొటన వేలు ఉంగరం వేలుతో కుడి చెవిని తాకుము

ఓం నారసింహాయ నమః  -- అని బొటన వేలు ఉంగరం వేలుతో ఎడమ చెవిని తాకుము
ఓం అచ్యుతాయ నమః  -- అని బొటన వేలు 
చిటికెన వేలుతో నాభిని తాకుము
ఓం జనార్ధనాయ నమః  -- అని హృదయమును తాకుము 
ఓం ఉపేంద్రాయ నమః  -- అని శిరమును తాకుము 
ఓం హరయే నమః  -- అని అన్ని వేళ్ళ మూలాలతో కుడి భుజమును తాకుము
ఓం శ్రీకృష్ణాయ నమః  -- అని అన్ని వేళ్ళ మూలాలతో ఎడమ  భుజమును తాకుము


భూతోచ్చాటన**  చేతిని గోకర్ణ ఆకారముగ పట్టి జలము తీసుకొని చుట్టూ చల్లుచు క్రింది మంత్రము చెప్పవలెను 
ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః |


దైవీ గాయత్రీ చందః ప్రాణాయామే వినియోగః

ప్రాణాయామః -- మూడు సార్లు ప్రాణాయామము చేయవలెను 

1) మొదట కుడి చేతి బొటన వేలుతో కుడి ముక్కు రంధ్రమును మూసుకొని ఎడమ ముక్కుతో నెమ్మదిగా శ్వాస తీసుకొనుము. తరువాత కుడి చేతి చిటికెన వేలు ఉంగరం వేలుతో ఎడమ ముక్కు మూసుకొని, శ్వాసను హృదయం నందు ఉంచి, క్రింది మంత్రము చెప్పుము. మంత్రము అయిన పిదప బొటన వేలుని విడిచి కుడి ముక్కుతో నెమ్మదిగా శ్వాస విడువవలెను, ఎడమ ముక్కుని విడువరాదు. 
2)మరుల కుడి ముక్కుతో నెమ్మదిగా శ్వాస తీసుకొనుము. తరువాత బొటన వేలుతో కుడి ముక్కుని మూసుకొని ,  శ్వాసను హృదయం నందు ఉంచి, క్రింది మంత్రము చెప్పుము. మంత్రము అయిన పిదప చిటికెన వేలు ఉంగరం వేలుని విడిచి ఎడమ ముక్కుతో నెమ్మదిగా శ్వాస విడువవలెను,  కుడి  ముక్కుని విడువరాదు. 
3)మరుల ఎడమ ముక్కుతో నెమ్మదిగా శ్వాస తీసుకొనుము. తరువాత కుడి చేతి చిటికెన వేలు ఉంగరం వేలుతో ఎడమ ముక్కు మూసుకొని, శ్వాసను హృదయం నందు ఉంచి, క్రింది మంత్రము చెప్పుము. మంత్రము అయిన పిదప బొటన వేలుని విడిచి కుడి ముక్కుతో నెమ్మదిగా శ్వాస విడువవలెను, ఎడమ ముక్కుని విడువరాదు.

ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ త్యమ్ |
ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | 
ధియో యో నః’ ప్రచోదయా”త్ ||
ఓమాపో జ్యోతీ రసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భు-స్సురోమ్ || 

సంకల్పః 

సంకల్పంలొ  చెప్పవలసిన వారాలు : 
ఆదివారం : భాను వాసరే 
సోమవారం : ఇందు వాసరే
మంగళవారం : కుజ వాసరే
బుధవారం : సౌమ్య వాసరే
గురువారం : గురు వాసరే
శుక్రవారం : భ్రుగు వాసరే
శనివారం : స్థిర వాసరే

మమోపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనే, అభ్యుదయ ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, (భారత దేశః – జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ/ఉత్తర దిగ్భాగే; అమేరికా – క్రౌంచ ద్వీపే, రమణక వర్షే, ఐంద్రిక ఖండే, సప్త సముద్రాంతరే, కపిలారణ్యే), శోభన గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … గోత్రస్య, … నామధేయోహంః ప్రాతః/మధ్యాహ్నిక/సాయం సంధ్యామ్ ఉపాసిష్యే ||

ఉధరిన లో జలము తీసుకొని కుడి చేతి ఉంగరం వేలుతో తాకి గాయత్రీ మంత్రం చెప్పుము . 

మంత్రించిన జలము శిరము పై చల్లుకుంటూ క్రింది మంత్రము చెప్పుము. 
మార్జనః  ఓం ఆపోహిష్ఠా మ’యోభువః’ | తా న’ ర్జే ద’ధాతన | హేరణా’ చక్ష’సే | యో వః’ శివత’మో రసః’ | తస్య’ భాజయతే హ నః | తీరి’వ మాతరః’ | తస్మా అర’ంగ మామ వః | యస్య క్షయా’ జిన్వ’థ | ఆపో’ నయ’థా చ నః |


ప్రాతః కాల మంత్రాచమనః- సూర్య శ్చ, మామన్యు శ్చ, మన్యుపతయ శ్చ, మన్యు’కృతేభ్యః | పాపేభ్యో’ రక్షంతామ్ | యద్రాత్ర్యా పాప’ మకార్షమ్ | మనసా వాచా’ స్తాభ్యామ్ | పద్భ్యా ముదరే’ణ శిశ్ంచా | రాత్రి స్తద’వలుంపతు | యత్కించ’ దురితం మయి’ | ఇదమహం మా మమృ’త యో నౌ | సూర్యే జ్యోతిషి జుహో’మి **స్వాహా** || 
మధ్యాహ్న కాల మంత్రాచమనః- ఆపః’ పునంతు పృథివీం పృ’థివీ పూతా పు’నాతు మామ్ | పుంతు బ్రహ్మ’స్పతి ర్బ్రహ్మా’ పూతా పు’నాతుమామ్ | యదుచ్ఛి’ష్ట మభో”జ్యం యద్వా’ దుశ్చరి’తం మమ’ | సర్వం’ పునంతు మా మాపో’‌உసతా ంచ’ ప్రతిగ్రగ్గ్ **స్వాహా** || 
సాయంకాల మంత్రాచమనః- అగ్ని శ్చ మా మన్యు శ్చ మన్యుపతయ శ్చ మన్యు’కృతేభ్యః | పాపేభ్యో’ రక్షంతామ్ | యదహ్నా పాప’ మకార్షమ్ | మనసా వాచా’ హస్తాభ్యామ్ | పద్భ్యా ముదరే’ణ శిశ్ంచా | అహ స్తద’వలుంపతు | య త్కించ’ దురితం మయి’ | ఇద మహం మా మమృ’త యోనౌ | సత్యే జ్యోతిషి జుహోమి **స్వాహా** || 

ఆచమ్య(ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)

ద్వితీయ మార్జనః

జలము శిరము పై చల్లుకుంటూ క్రింది మంత్రము చెప్పుము.
ధి క్రావణ్ణో’ అకారిషమ్ | జిష్ణో రశ్వ’స్య వాజి’నః |
సురభినో ముఖా’కత్ప్ర ఆయూగ్‍మ్’షి తారిషత్ ||

ఓం ఆపో హిష్ఠా మ’యోభువః’ | తా న’ ర్జే ద’ధాతన | హేరణా’ చక్ష’సే | యో వః’ శివత’మో రసః’ | తస్య’ భాజయతే హ నః | తీరి’వ మాతరః’ | తస్మా అర’ంగ మామ వః | యస్య క్షయా’ జిన్వ’థ | ఆపో’ నయ’థా చ నః ||


పునః మార్జనఃహిర’ణ్యవర్ణా శ్శుచ’యః పాకాః యా సు’జాతః శ్యపో యా స్వింద్రః’ | గ్నిం యా గర్భ’న్-దధిరే విరూ’పా స్తాశ్శగ్గ్ స్యోనా భ’వంతు |  శిరము పై జలము చల్లుకొనుము
యా సాగ్ం రాజా వరు’ణో యాతి మధ్యే’ సత్యానృతే అ’శ్యం జనా’నామ్ | ధుశ్చుశ్శుచ’యో యాః పా’కా స్తా ఆశ్శగ్గ్ స్యోనా భ’వంతు |  శిరము పై జలము చల్లుకొనుము 
యాసాం” దేవా దివి కృణ్వంతి’ క్షం యాంతరి’క్షే బహుథా భవ’ంతి | యాః పృ’థివీం పయ’సోందంతి’ శ్శుక్రాస్తా శగ్గ్ స్యోనా భ’వంతు |   శిరము పై జలము చల్లుకొనుము
యాఃశివేన’ మా చక్షు’షా పశ్యతాపశ్శివయా’ ను వోప’స్పృశ త్వచ’ మ్మే | సర్వాగ్’మ్ గ్నీగ్‍మ్ ర’ప్సుషదో’ హువే వోయి ర్చో  మోజో నిధ’త్త || 
(మార్జనం కుర్యాత్)  హస్తమున జలము తీసుకొని క్రింది మంత్రము చెప్పుచు శ్వాస విడిచి ఆ జలమును ఎడమ వైపున విడువ వలెను మరల ఆ జలము చూడరాదు. 
ద్రుదా ది’వ ముంచతు | ద్రుదా దివే న్ము’ముచానః |
స్విన్న స్స్నాత్వీ మలా’ దివః | పూతం పవిత్రే’ణే వాజ్య”మ్ ఆప’ శ్శుందంతు మైన’సః ||

అర్ఘ్య త్రయ ప్రధానం :-  

అర్ఘ్యము అనగా జలమును రెండు చేతుల్లో తీసుకొని విడుచుట 

ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః) 
ప్రాణాయామః 
లఘుసంకల్పః పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మధ్యాహ్నిక/సాయం సంధ్యాంగ  అర్ఘ్య త్రయ ప్రదానం కరిష్యే  లేదా (కాలాతిక్రమణ0 అయితే)  కాలాతిక్రమణ దోష పరిహారార్ధం చతుర్ధార్ఘ్య ప్రధానం కరిష్యే
ప్రాతః సంధ్య కి నిలుచుకొని చేయవలెను, సాయం సంధ్య కి పడమర వైపు తిరిగి చేయవలెను. 
మధ్యాహ్నిక సంధ్య కి క్రింది మంత్రము చెప్పి అర్ఘ్యము చేయవలెను 
ఓం గ్ం సశ్శు’చిష ద్వసు’రంతరిక్షస ద్దోతా’ వేదిషదతి’థి ర్దురోసత్ | నృష ద్వ’స దృ’స ద్వ్యో’ సబ్జా గోజా ఋ’జా అ’ద్రిజా తమ్-బృహత్ || 
కాలాతిక్రమణo అయితే -- ఓం భూర్భుస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ త్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీ సో‌உమృతం బ్రహ్మ భూ-ర్భు-స్సురోమ్ ||  -- అర్ఘ్యము విడువవలెను 
ఓం భూర్భుస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ -- అర్ఘ్యము విడువవలెను 
ఓం భూర్భుస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ -- అర్ఘ్యము విడువవలెను 
ఓం భూర్భుస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ -- అర్ఘ్యము విడువవలెను 
జలము రెండు చేతుల్లో తీసుకొని ప్రదక్షిణం చేయుచు క్రింది మంత్రము చెప్పవలెను. ఓం ద్యంత’మస్తం యంత’ మాదిత్య మ’భిథ్యాయ న్కుర్వన్-బ్రా”హ్మణో విద్వాన్ త్సకల’మ్-ద్రమ’శ్నుతేఅసావా’దిత్యో బ్రహ్మేతి || బ్రహ్మైవ సన్-బ్రహ్మాప్యేతి య వం వేద || అసావాదిత్యో బ్రహ్మ ||

తర్పణం:-

ద్విరాచమ్య(ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః) -- రెండు సార్లు ఆచమనము చేయవలెను ప్రాణాయామః 
లఘుసంకల్పః
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మధ్యాహ్నిక/సాయం సంధ్యాంగ తర్పణం కరిష్యే. 

**తర్పయామి అని చెప్పినప్పుడు జలము విడువవలెను 

ప్రాతఃకాల తర్పణం -- సంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||
మధ్యాహ్న తర్పణం -- సంధ్యాం తర్పయామి, సావిత్రీం తర్పయామి, రౌద్రీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||
సాయంకాల తర్పణం -- సంధ్యాం తర్పయామి, సరస్వతీం తర్పయామి, వైష్ణవీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||

గాయత్రీ అవాహన:-

ఓమిత్యేకాక్ష’రం బ్రహ్మ | అగ్నిర్దేవతా బ్రహ్మ’ ఇత్యార్షమ్ | గాయత్రం ఛందం పరమాత్మం’ సరూపమ్ | సాయుజ్యం వి’నియోమ్ || 
ఆయా’తు వర’దా దేవీ క్షరం’ బ్రహ్మసంమితమ్ | గాత్రీం” ఛంద’సాం మాతేదం బ్ర’హ్మ జుషస్వ’ మే | యదహ్నా”త్-కురు’తే పాపం తదహ్నా”త్-ప్రతిముచ్య’తే | యద్రాత్రియా”త్-కురు’తే పాపం తద్రాత్రియా”త్-ప్రతిముచ్య’తే | సర్వ’ ర్ణే మ’హాదేవి ంధ్యావి’ద్యే రస్వ’తి ||
ఓజో’‌உసి సహో’‌உసి బల’మసి భ్రాజో’‌உసి దేవానాం ధానామా’సి విశ్వ’మసి విశ్వాయు-స్సర్వ’మసిర్వాయు-రభిభూరోమ్ | గాయత్రీ-మావా’హయామి సావిత్రీ-మావా’హయామి సరస్వతీ-మావా’హయామిఛందర్షీ-నావా’హయామి శ్రియ-మావాహ’యామి గాయత్రియా గాయత్రీ చ్ఛందో విశ్వామిత్రఋషి స్సవితా దేవతా‌உగ్నిర్-ముఖం బ్రహ్మా శిరో విష్ణుర్-హృదయగ్‍మ్ రుద్ర-శ్శిఖా పృథివీ యోనిః ప్రాణాపాన వ్యానోదాన సమానా సప్రాణా శ్వేతవర్ణా సాంఖ్యాయన సగోత్రా గాయత్రీ చతుర్విగ్‍మ్ శత్యక్షరా త్రిపదా’ షట్-కుక్షిః పంచ-శీర్షోపనయనే వి’నియోగః |


గాయత్రీ జపం 

ఆచమ్య --
 (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః) లేదా కింద చెప్పిన విధానం అయినా చేయవచ్చు 
ఓం తథ్స’వితుర్వరే”ణ్యగ్‍ స్వాహా 
భర్గో’ దేవస్య’ ధీమహి స్వాహా
ధియో యో నః’ ప్రచోదయా”త్ స్వాహా 

పోహిష్ఠా మ’యోభువః’ | తా న’ ర్జే ద’ధాతన  -- అని చేతులు కడిగికొని 
హేరణా’ చక్ష’సే -- బొటన వేలుతో పై పెదవిని తుడుచుకొనుము యో వః’ 
శివత’మో రసః’ -- బొటన వేలుతో కింద పెదవిని తుడుచుకొనుము 
తస్య’ భాజయతే హ నః -- ఉంగరం వేలుతో జలము శిరమున  చల్లుకోనుము 
తీరి’వ మాతరః’ -- ఉంగరం వేలుతో జలము శిరమున చల్లుకోనుము 
స్మా అర’ంగ మామ వః  -- ఎడమ చేతిపై జలము చల్లుకోనుము 
స్య క్షయా’ జిన్వ’థ  -- పాదముల పై జలము చల్లుకోనుము  
ఆపో’ నయ’థా చ నః  -- జలము శిరమున చల్లుకోనుము 
ఓం భూః -- అని అన్ని వేళ్ళ మూలాలతో గడ్డమును తాకుము
ఓం భువః  -- అని బొటన వేలుతో కుడి ముక్కు రంధ్రమును తాకుము 
ఓగ్‍మ్ సువః  -- అని చూపుడు వేలుతో ఎడమ ముక్కు రంధ్రమును తాకుము 
ఓం మహః -- అని బొటన వేలుతో కుడి కన్నును తాకుము
ఓం జనః  -- అని ఉంగరం వేలుతో ఎడమ కన్నును తాకుము
ఓం తపః  -- అని బొటన వేలు ఉంగరం వేలుతో కుడి చెవిని తాకుము
ఓగ్‍మ్ త్యమ్  -- అని బొటన వేలు ఉంగరం వేలుతో ఎడమ చెవిని తాకుము
ఓం తథ్స’వితుర్వరే”ణ్యం  -- అని బొటన వేలు చిటికెన వేలుతో నాభిని తాకుము
భర్గో’ దేవస్య’ ధీమహి  -- అని హృదయమును తాకుము 
ధియో యో నః’ ప్రచోదయా”త్  -- అని శిరమును తాకుము 
ఓమాపో జ్యోతీ రసో‌உమృతం  -- అని అన్ని వేళ్ళ మూలాలతో కుడి భుజమును తాకుము
బ్రహ్మ భూ-ర్భు-స్సురోమ్ -- అని అన్ని వేళ్ళ మూలాలతో ఎడమ  భుజమును తాకుము

ప్రాణాయామః
లఘుసంకల్పః

పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మధ్యాహ్నిక/సాయం సంధ్యాంగ యథాశక్తి గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే. 


కరన్యాసః
ఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాం నమః | -- అని చూపుడు వేలుతో బొటన వేలు చివర నుంచి పై వరకు తాకవలెను 
వరే”ణ్యం విష్ణవాత్మనే తర్జనీభ్యాం నమః | -- అని  బొటన వేలుతో 
చూపుడు వేలు 

చివర నుంచి పై వరకు తాకవలెను
భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః |-- అని  బొటన వేలుతో మధ్య వేలు చివర నుంచి పై వరకు తాకవలెను 
ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః | -- అని  బొటన వేలుతో ఉంగరం వేలు చివర నుంచి పై వరకు తాకవలెను 
ధియో యో నః’ ఙ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమః | -- 
అని  బొటన వేలుతో చిటికెన వేలు చివర నుంచి పై వరకు తాకవలెను 

ప్రచోదయా”త్ సర్వాత్మనే కరతల కరపృష్టాభ్యాం నమః | -- అని ఎడమ చేత్తో కుడి  చేయి వెనక తాకి మరల కుడి చేత్తో ఎడమ చేయి వెనక తాకుము
అంగన్యాసః
ఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః | - అని అర చేత్తో హృదయమును తాకుము
వరే”ణ్యం విష్ణవాత్మనే శిరసే స్వాహా | -- అని 
శిరమును తాకుము
భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే శిఖాయై వషట్ | -- అని కుడి 
చేత్తో శిఖని తాకి, కుడి చేయిని చుట్టూ తిప్పి ఎడమ చేయి మీద పెట్టుము 

ధీమహి సత్యాత్మనే కవచాయ హుమ్ | -- అని ఎడమ చేయిని కుడి భుజము పై పెట్టి కుడి చేతిని ఎడమ భుజము పై పెట్టుము 
ధియో యో నః’ ఙ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ | -- అని కుడి చేతి 
ఉంగరం వేలుతో కళ్ళను తాకి చుట్టూ తిప్పి ఎడమ చేయి మీద పెట్టుము
ప్రచోదయా”త్ సర్వాత్మనే అస్త్రాయఫట్ | -- 
కుడి చేయిని చుట్టూ తిప్పి ఎడమ చేయి మీద పెట్టుము

ఓం భూర్భుస్సురోమితి దిగ్భంధః |  -- అని కుడి చేయి చూపుడు వేలుతో ఎడమ చేయి చూపుడు వేలుని పట్టుకొనుము 
ధ్యానమ్ --
ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్చాయైర్-ముఖై స్త్రీక్షణైః |
యుక్తామిందుని బద్ధ రత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రంకపాలంగదామ్ |
శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీం భజే ||

**గాయత్రీ ముద్రలు - గురువు దగ్గర నేర్చుకోవలెను 
 యో దేవ స్సవితా‌உస్మాకం ధియో ధర్మాదిగోచరాః |
ప్రేరయేత్తస్య యద్భర్గస్త ద్వరేణ్య ముపాస్మహే ||

గాయత్రీ మంత్రం -- 
** బ్రహ్మ ముడిని కుడి చేతి లో పెట్టుకొని యథాశక్తిగా చేసుకోవలెను(32/64/108)
**ప్రాతః సంధ్య కి నిలుచుకొని  కుడి చేతిని నాభి(బొడ్డు) దగ్గర పెట్టుకొని  చేయవలెను 
** మధ్యాహ్నిక సంధ్య కి కూర్చొని కుడి చేతిని హృదయమును దగ్గర పెట్టుకొని  చేయవలెను  
** సాయం సంధ్య కి కూర్చొని కుడి చేతిని భ్రుకుటి(రెండు కనుబొమ్మల మధ్య) దగ్గర పెట్టుకొని  చేయవలెను 

ఓం భూర్భుస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || 
ఆచమ్య --
 (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః) లేదా కింద చెప్పిన విధానం అయినా చేయవచ్చు 
ఓం తథ్స’వితుర్వరే”ణ్యగ్‍ స్వాహా 
భర్గో’ దేవస్య’ ధీమహి స్వాహా
ధియో యో నః’ ప్రచోదయా”త్ స్వాహా 
పోహిష్ఠా మ’యోభువః’ | తా న’ ర్జే ద’ధాతన  -- అని చేతులు కడిగికొని 
హేరణా’ చక్ష’సే -- బొటన వేలుతో పై పెదవిని తుడుచుకొనుము యో వః’ 
శివత’మో రసః’ -- బొటన వేలుతో కింద పెదవిని తుడుచుకొనుము 
తస్య’ భాజయతే హ నః -- ఉంగరం వేలుతో జలము శిరమున  చల్లుకోనుము 
తీరి’వ మాతరః’ -- ఉంగరం వేలుతో జలము శిరమున చల్లుకోనుము 
స్మా అర’ంగ మామ వః  -- ఎడమ చేతిపై జలము చల్లుకోనుము 
స్య క్షయా’ జిన్వ’థ  -- పాదముల పై జలము చల్లుకోనుము  
ఆపో’ నయ’థా చ నః  -- జలము శిరమున చల్లుకోనుము 
ఓం భూః -- అని అన్ని వేళ్ళ మూలాలతో గడ్డమును తాకుము
ఓం భువః  -- అని బొటన వేలుతో కుడి ముక్కు రంధ్రమును తాకుము 
ఓగ్‍మ్ సువః  -- అని చూపుడు వేలుతో ఎడమ ముక్కు రంధ్రమును తాకుము 
ఓం మహః -- అని బొటన వేలుతో కుడి కన్నును తాకుము
ఓం జనః  -- అని ఉంగరం వేలుతో ఎడమ కన్నును తాకుము
ఓం తపః  -- అని బొటన వేలు ఉంగరం వేలుతో కుడి చెవిని తాకుము
ఓగ్‍మ్ త్యమ్  -- అని బొటన వేలు ఉంగరం వేలుతో ఎడమ చెవిని తాకుము
ఓం తథ్స’వితుర్వరే”ణ్యం  -- అని బొటన వేలు చిటికెన వేలుతో నాభిని తాకుము
భర్గో’ దేవస్య’ ధీమహి  -- అని హృదయమును తాకుము 
ధియో యో నః’ ప్రచోదయా”త్  -- అని శిరమును తాకుము 
ఓమాపో జ్యోతీ రసో‌உమృతం  -- అని అన్ని వేళ్ళ మూలాలతో కుడి భుజమును తాకుము
బ్రహ్మ భూ-ర్భు-స్సురోమ్ -- అని అన్ని వేళ్ళ మూలాలతో ఎడమ  భుజమును తాకుము


ప్రాణాయామః
లఘుసంకల్పః
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మధ్యాహ్నిక/సాయం సంధ్యాంగ గాయత్రీ మహామంత్ర  జపావసానమ్ కరిష్యే. 

కరన్యాసః
ఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాం నమః | -- అని చూపుడు వేలుతో బొటన వేలు చివర నుంచి పై వరకు తాకవలెను 
వరే”ణ్యం విష్ణవాత్మనే తర్జనీభ్యాం నమః | -- అని  బొటన వేలుతో 
చూపుడు వేలు 
చివర నుంచి పై వరకు తాకవలెను
భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః |-- అని  బొటన వేలుతో మధ్య వేలు చివర నుంచి పై వరకు తాకవలెను 
ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః | -- అని  బొటన వేలుతో ఉంగరం వేలు చివర నుంచి పై వరకు తాకవలెను 
ధియో యో నః’ ఙ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమః | -- 
అని  బొటన వేలుతో చిటికెన వేలు చివర నుంచి పై వరకు తాకవలెను 

ప్రచోదయా”త్ సర్వాత్మనే కరతల కరపృష్టాభ్యాం నమః | -- అని ఎడమ చేత్తో కుడి  చేయి వెనక తాకి మరల కుడి చేత్తో ఎడమ చేయి వెనక తాకుము
అంగన్యాసః
ఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః | - అని అర చేత్తో హృదయమును తాకుము
వరే”ణ్యం విష్ణవాత్మనే శిరసే స్వాహా |
-- అని శిరమును తాకుము
భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే శిఖాయై వషట్ |
-- అని కుడి చేత్తో శిఖని తాకి, కుడి చేయిని చుట్టూ తిప్పి ఎడమ చేయి మీద పెట్టుము 

ధీమహి సత్యాత్మనే కవచాయ హుమ్ | -- అని ఎడమ చేయిని కుడి భుజము పై పెట్టి కుడి చేతిని ఎడమ భుజము పై పెట్టుము
ధియో యో నః’ ఙ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ | -- అని కుడి చేతి 
ఉంగరం వేలుతో కళ్ళను తాకి చుట్టూ తిప్పి ఎడమ చేయి మీద పెట్టుము
ప్రచోదయా”త్ సర్వాత్మనే అస్త్రాయఫట్ |
-- కుడి చేయిని చుట్టూ తిప్పి ఎడమ చేయి మీద పెట్టుము

ఓం భూర్భుస్సురోమితి దిగ్విమోకః  |  -- అని కుడి చేయి చూపుడు వేలుతో ఎడమ చేయి మొదలు నుంచి చివర వరకు తాకవలెను  
ధ్యానమ్ --
ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్చాయైర్-ముఖై స్త్రీక్షణైః |
యుక్తామిందుని బద్ధ రత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రంకపాలంగదామ్ |
శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీం భజే ||


**గాయత్రీ  ఉత్తర ముద్రలు - గురువు దగ్గర నేర్చుకోవలెను 

ఓం తత్సద్-బ్రహ్మార్పణమస్తు(నీరు విడువవలెను)

సూర్యోపస్థానం :-


ఆచమ్య -- (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః) 

ప్రాణాయామః 
లఘుసంకల్పః 
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మధ్యాహ్నిక/సాయం సంధ్యాంగ సూర్యోపస్థానం కరిష్యే.
** నిలుచుకొని చేయవలెను

ప్రాతఃకాల సూర్యోపస్థానం:- 
ఓం మిత్రస్య’ ర్షణీ ధృ శ్రవో’ దేవస్య’ సా సిమ్ | త్యం చిత్రశ్ర’ వస్తమమ్ | మిత్రో జనాన్’ యాతయతి ప్రజానన్-మిత్రో దా’ధార పృథివీ ముతద్యామ్ | మిత్రః కృష్టీ రని’మిషా‌உభి చ’ష్టే త్యాయ’ వ్యం ఘృతవ’ద్విధేమ | ప్రసమి’త్త్ర మర్త్యో’ అస్తు ప్రయ’స్వా న్యస్త’ ఆదిత్య శిక్ష’తి వ్రతేన’ | న హ’న్యతే న జీ’యతే త్వోతోనై మగ్ంహో’ అశ్నోత్యంతి’తో న దూరాత్ || 

మధ్యాహ్న సూర్యోపస్థానం:-
ఓం ఆ త్యే రజ’సా వర్త’మానో నివేశ’య న్నమృతం మర్త్య’ంచ | హిరణ్యయే’న సవితా రథేనా‌உదేవో యా’తిభువ’నా నిపశ్యన్’ ||ద్వయ ంతమ’ స్పరి పశ్య’ంతో జ్యోతి రుత్త’రమ్ | దేవన్-దే’త్రా సూర్య మగ’న్మ జ్యోతి’ రుత్తమమ్ ||
దుత్యం జాతవే’దసం దేవం వ’హంతి కేతవః’ | దృశే విశ్వా’  సూర్య”మ్ || చిత్రం దేవానా ముద’గా దనీ’కంచక్షు’ర్-మిత్రస్య వరు’ణ స్యాగ్నేః | అప్రా ద్యావా’ పృథివీ అంతరి’క్షగ్‍మ్ సూర్య’ త్మా జగ’త స్తస్థుష’శ్చ ||
తచ్చక్షు’ర్-దేవహి’తం పురస్తా”చ్చుక్ర ముచ్చర’త్ | పశ్యే’మ రద’శ్శతం జీవే’మ రద’శ్శతం నందా’మరద’శ్శతం మోదా’మ రద’శ్శతం భవా’మ రద’శ్శతగ్‍మ్ శృణవా’మ రద’శ్శతం పబ్ర’వామరద’శ్శతమజీ’తాస్యామ రద’శ్శతం జోక్చ సూర్యం’ దృషే || య ఉద’గాన్మతో‌உర్ణవా” ద్విభ్రాజ’మాన స్సరిస్య మధ్యాథ్సమా’ వృభో లో’హితాక్షసూర్యో’ విశ్చిన్మన’సా పునాతు ||
సాయంకాల సూర్యోపస్థానం:-
** పడమర వైపు తిరిగి చేయవలెను. 
ఓం మమ్మే’ వరుణ శృధీ హవ’ ద్యా చ’ మృడయ | త్వా మ’స్యు రాచ’కే || తత్వా’ యామి బ్రహ్మ’ణావంద’మా స్త దాశా”స్తే యజ’మానో విర్భిః’ | అహే’డమానో వరుణేహ బోధ్యురు’గ్ం సమా’ ఆయుః ప్రమో’షీః ||
యచ్చిద్ధితే విశోయథా ప్రదేవ వరుణవ్రతమ్ | మినీమసిద్య విద్యవి | యత్కించేదం వరుణదైవ్యే జనే‌உభిద్రోహ మ్మనుష్యాశ్చరామసి | అచిత్తే యత్తవ ధర్మాయుయోపి మమాన స్తస్మా దేనసో దేవరీరిషః | కితవాసో యద్రిరిపుర్నదీవి యద్వాఘా సత్యముతయన్న విద్మ | సర్వాతావిష్య శిధిరేవదేవా థాతేస్యామ వరుణ ప్రియాసః || 
దిగ్దేవతా నమస్కారః
ఓం నమః ప్రాచ్యై’ దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ | -- తూర్పు తిరిగి నమస్కరించుము 
ఓం నమః దక్షిణాయై దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ | -- దక్షిణం తిరిగి నమస్కరించుము 
ఓం నమః ప్రతీ”చ్యై దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ | -- పడమర 
తిరిగి నమస్కరించుము 
ఓం నమః ఉదీ”చ్యై దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ | -- ఉతరం 
తిరిగి నమస్కరించుము 
ఓం నమః ర్ధ్వాయై’ దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ | -- పైకి పైకి చూసి 
నమస్కరించుము 
ఓం నమో‌உధ’రాయై దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ | -- కిందకి 
చూసి నమస్కరించుము
ఓం నమో‌உవాంతరాయై’ దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ | -- చేయి చుట్టూ తిప్పి 
నమస్కరించుము
ముని నమస్కారః :-  ప్రదక్షిణం చేస్తూ కింది మంత్రము చెప్పుము 
నమో గంగా యమునయోర్-మధ్యే యే’ వంతి తే మే ప్రసన్నాత్మాన శ్చిరంజీవితం వ’ర్ధంతి నమో గంగా యమునయోర్-ముని’భ్యశ్చ నమో నమో గంగా యమునయోర్-ముని’భ్యశ్చ న’మః || సంధ్యా’యై నమః’ | సావి’త్ర్యై నమః’ | గాయ’త్ర్యై నమః’ | సర’స్వత్యై నమః’ | సర్వా’భ్యో దేవతా’భ్యో నమః’ | దేవేభ్యోనమః’ | ఋషి’భ్యో నమః’ | ముని’భ్యో నమః’ | గురు’భ్యో నమః’ | పితృ’భ్యో నమః’ | కామో‌உకార్షీ” ర్నమో నమః | మన్యు రకార్షీ” ర్నమో నమః | పృథివ్యాపస్తేజో వాయు’రాకాశాత్ నమః || 
ఓం నమో భగవతే వాసు’దేవాయ | యాగ్‍మ్ సదా’ సర్వభూతాని రాణి’ స్థారాణి’ చ | సాయం ప్రాత ర్న’మస్యంతి సా మా సంధ్యా’‌உభిరక్షతు ||
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః ||
యథా శివమయో విష్ణురేవం విష్ణుమయః శివః |
యథా‌உంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి ||
నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ |
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ||
గాయత్రీ ఉద్వాసన (ప్రస్థానం)త్తమే’ శిఖ’రే జాతే భూమ్యాం ప’ర్వమూర్థ’ని | బ్రాహ్మణే”భ్యో‌உభ్య’ను ఙ్ఞాతా చ్చదే’వి థాసు’ఖమ్ | స్తుతో మయా వరదా వే’దమాతా ప్రచోదయంతీ పవనే” ద్విజాతా | ఆయుః పృథివ్యాం ద్రవిణం బ్ర’హ్మర్చసం మహ్యం దత్వా ప్రజాతుం బ్ర’హ్మలోకమ్ || (మహానారాయణ ఉపనిషత్)
భగవన్నమస్కారఃనమో‌உస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే |
సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగ ధారిణే నమః ||
భూమ్యాకాశాభి వందనందం ద్యా’వా పృథివీ త్యమ’స్తు | పిర్-మాతర్యది హోప’ బృవేవా”మ్ |
భూతం దేవానా’ మవమే అవో’భిః | విద్యా మేషం వృజినం’ జీరదా’నుమ్ ||
ఆకాశాత్-పతితం తోయం యథా గచ్ఛతి సాగరమ్ |
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి || 
శ్రీ కేశవం ప్రతిగచ్ఛత్యోన్నమ ఇతి |
సర్వవేదేషు యత్పుణ్యమ్ | సర్వతీర్థేషు యత్ఫలమ్ |
తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వాదేవం జనార్ధనమ్ ||
స్తుత్వాదేవం జనార్ధన ఓం నమ ఇతి ||
వాసనాద్-వాసుదేవస్య వాసితం తే జయత్రయమ్ |
సర్వభూత నివాసో‌உసి శ్రీవాసుదేవ నమో‌உస్తుతే ||
శ్రీ వాసుదేవ నమో‌உస్తుతే 

అభివాదః (ప్రవర)

**ఎడమ చేత్తో కుడి చెవిని కుడి చేత్తో ఎడమ చెవిని మూసి ప్రవర చెప్పి భూమిని తాకి నమస్కరించవలెను
చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు | … త్రయారుషేయ  ప్రవరాన్విత … గోత్రః … సూత్రః … శాఖాధ్యాయీ … అహం భో అభివాదయే ||
**ఉదాహరణకు-- మీది కాశ్యపస గోత్రం అయితే --  చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు | "కాశ్యప ఆవత్సర నైధ్రువ" త్రయారుషేయ  ప్రవరాన్విత "కాశ్యపస" గోత్రః  "ఆపస్థంభ" సూత్రః "కృష్ణ యజు" శాఖాధ్యాయీ "మీ పేరు" అహం భో అభివాదయే ||

ఆచమ్య -- (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
ఈశ్వరార్పణం (నీరు విడువవలెను)
కాయేన వాచా మనసేంద్రియైర్వా | బుద్ధ్యా‌உ‌உత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ |
కరోమి యద్యత్-సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి || 
(నీరు విడువవలెను)
హరిః ఓం తత్సత్ | తత్సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు | 
(నీరు విడువవలెను)

భోజన సామాన్య విధి 

** చేతిని గోకర్ణ ఆకారముగ పట్టి జలము తీసుకొని 
ఓం భూర్భుస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || 
** అని మంత్రించిన జలమును అన్నము పై చల్లి, 
పగటి వేళ -- సత్యం త్వర్తేన పరిషించామి 
రాత్రి వేళ -- రుతం త్వా సత్యేన పరిషించామి 
** అని భోజన పాత్రకు ప్రదక్షినగా చుట్టూ జలమును చల్లి, మరల చేతిలో జలము తీసుకొని 
అమృతమస్తు అమృతో పస్తరణ మసి స్వాహా 
**అని జలము త్రాగవలెను. 

ప్రాణాహుతః :-

** ఎడమ చేతి ఉంగరం వేలు భోజన పాత్ర పై ఉంచి, కుడి చేతి చిటికెన వ్రేలు విడిచి మిగిలిన వ్రేళ్ళతో కింద మంత్రములు చెప్పుచు అయిదు సార్లు ప్రాణాహుతులను(అన్నం లేదా పాత్రలో ఉన్న ఏ పదార్ధం అయినా) నోటిలో వేసుకొనుము. పెదవికి మరియు పంటికి తగలకుండా మింగవలెను. 
ఓం ప్రాణాయ స్వాహా  
ఓం అపానాయ స్వాహా 
ఓం వ్యానాయ స్వాహా 
ఓం ఉదానాయ స్వాహా 
ఓం సమానాయ స్వాహా 


**ఔపొసన పట్టాక భోజనo మధ్యలో లేవడం నిషిధం. 

భోజనానంతరము 

** చేతిని గోకర్ణ ఆకారముగ పట్టి జలము తీసుకొని
అమృతాపిధానమసి -- అని జలమును త్రాగవలెను
పిదప కింద మంత్రము చెప్పుచు మిగిలిన జలమును భోజన పాత్రకు అప్రదక్షినగా చుట్టూ చల్లవలెను. 
రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినమ్। 
అర్ధినాముదకం దత్తమక్షయ్య ముపతిష్ఠతు 


తప్పులు ఉంటే లేదా ఏమయినా సలహాలు ఉంటే క్రింద id కి మెయిల్ చేయండి. 
sriabhiram@gmail.com

Blog:
http://thrikalasandhyavandanam.blogspot.in/

9 comments:

  1. Thank you very much Abhi. It's a good learning for me.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. Dude,
    Need this in English. Telugu ledu, kadu. :)

    ReplyDelete
    Replies
    1. :) i will try to do that in english, it may take some time. can i know who gave this comment plsss so that i can update u once it is done ??

      Delete
  4. సంధ్యా వందనం విధానాలు : ఎవరు కృష్ణ యజుర్వేదం విధానం పాటించాలి? ఎన్ని రకాల విధానాలు కలవు? నేను, 6000 నియోగి, భారద్వాజ గోత్రం. ఏ విధానం నేర్చుకోవాలి తెలుపగలరు?

    ReplyDelete
  5. మీద ఇచ్చిన విధానం ప్రకారం చేయడం మొదలు పెట్టండి. గాయత్రి మీ గమ్యాన్ని చేరుస్తుంది.

    ReplyDelete
  6. Thank you sir
    Alage సూర్యోపస్థానం mantrala ardham vivarinchumu please

    ReplyDelete